27.4 C
Hyderabad
Monday, July 13, 2020

గాయని కనికా కపూర్‌కు నాలుగోసారీ పాజిటివ్

బాలీవుడ్ గాయని కనికా కపూర్‌కు వరుసగా నాలుగోసారీ కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో తేలింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కరోనా పాజిటివ్ కారణంగా ఆమె ఈ నెల 20న ఆసుపత్రిలో చేరింది. ప్రస్తుతం ఆమె సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లో చికిత్స పొందుతున్నారు. రిపోర్టులను చూసి తాము తీవ్ర ఆందోళనలో మునిగిపోయామని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. డాక్టర్లు చేసే చికిత్సకు కూడా ఆమె స్పందించడం లేదని వాపోయారు. కనికాను ఎక్కడికైనా తీసుకెళ్దామన్న అన్ని విమాన సర్వీసులు నిలిచిపోయానని అన్నారు. దేవుడ్ని ప్రార్థించడం తప్ప మరో మార్గమేమీ తమకు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఆమె పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కనికా కపూర్ మార్చి 9న లండన్ నుంచి ఉత్తర్‌ ప్రదేశ్‌ లోని ఓ హోటల్‌ లో బస చేశారు. ఈ క్రమంలోనే ఆ హోటల్‌లో సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులను కలిసి పార్టీ జరిపారు. తర్వాత ఆమెకు కరోనా పరీక్ష నిర్వహించడంతో పాజిటివ్ గా తేలింది. దీంతో కనికాతో పాటు ఆమెను కలిసిన పలువురు ప్రముఖులు కూడా సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్లిపోయారు.

- Advertisement -

Latest news

ఉపాధి, ఇతర రంగాలపై కరోనా ‌తీవ్ర ప్రభావం చూపింది- ఆర్‌బీఐ గవర్నర్

దేశంలో వందేళ్లలో ఎన్నడూలేని పరిస్థితులు నెలకొన్నాయని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ఎస్‌బీఐ బ్యాంకింగ్‌, ఎకనమిక్‌ కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న ఆయన, ప్రస్తుత సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ఆర్‌బీఐ అన్ని...

Related news

ఉపాధి, ఇతర రంగాలపై కరోనా ‌తీవ్ర ప్రభావం చూపింది- ఆర్‌బీఐ గవర్నర్

దేశంలో వందేళ్లలో ఎన్నడూలేని పరిస్థితులు నెలకొన్నాయని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ఎస్‌బీఐ బ్యాంకింగ్‌, ఎకనమిక్‌ కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న ఆయన, ప్రస్తుత సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ఆర్‌బీఐ అన్ని...

అంబర్‌పేట ఫ్లైఓవర్‌ నిర్మాణం త్వరలో పూర్తి:మంత్రి కేటీఆర్

లాక్‌డౌన్‌తో మార్చి నెల నుంచి ఇప్పటివరకు జీహెచ్‌ఎంసీలో నాలుగు రెట్ల వేగంతో పనులను పూర్తిచేశామని, తొమ్మిది నెలల్లో జరగాల్సిన పనులు లాక్‌డౌన్‌ వల్ల రెండు నెలల్లోనే పూర్తయ్యాయని మంత్రి కేటీఆర్‌...

జమ్మూకాశ్మీర్ లో ఎన్ కౌంటర్, ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్‌ లో ఉగ్రవాదులకు చెక్‌ పెడుతున్నాయి భద్రతా బలగాలు. ఉత్తర కశ్మీర్‌ లోని నౌగామ్‌ సెక్టార్‌ లోకి అక్రమంగా చొచ్చుకువచ్చిన ఇద్దరు టెర్రరిస్టులను మట్టుబెట్టాయి. ఉగ్రవాదుల మృతదేహాల వద్ద రెండు...

జపాన్‌లో వరదలు….66మంది మృతి

నేపాల్‌, జపాన్‌ దేశాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. నేపాల్‌ లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వరదలు పోటెత్తుతున్నాయి.వరదల దాటికి వేలాది ఇండ్లు కొట్టుకుపోయాయి. దీనికి తోడు కొండచరియలు విరిగిపడుతుండడంతో...