27.3 C
Hyderabad
Tuesday, November 24, 2020

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌: మొక్కలు నాటిన దగ్గుబాటి రానా

ఎంపీ సంతోష్‌ కుమార్ చేపట్టిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌కు అద్భుత స్పందన లభిస్తోంది. యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌, హీరోయిన్‌ శృతిహాసన్‌ విసిరిన గ్రీన్‌ ఛాలెంజ్‌ను హీరో దగ్గుబాటి రానా  స్వీకరించారు. హైదరాబాద్‌ రామానాయుడు స్టూడియోలో మూడు మొక్కలు నాటారు. సమాజానికి మేలు చేసే ఇంత మంచి కార్యక్రమంలో తనను  భాగస్వామ్యం చేసిన  ప్రభాస్ కు రానా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తన అభిమానులు,  దగ్గుబాటి కుటుంబ అభిమానులు, ప్రకృతి ప్రేమికులంతా పాల్గొని ముందుకు తీసుకుపోవాలని పిలుపునిచ్చారు.  ఈ సంకల్పానికి తనవంతు ప్రయత్నంగా ఎవరు మొక్కలు నాటి తనకు  ట్యాగ్ చేసినా రీట్విట్ చేస్తానంటూ తెలిపారు. ఇక గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటిన  దగ్గుబాటి రానాను అభినందిస్తూ ఎంపీ సంతోష్‌ కుమార్‌ ట్వీట్‌ చేశారు. కొద్ది రోజుల క్రితం వివాహం చేసుకున్న రానాకు శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

Latest news

Related news

హైదరాబాద్‌ ని దేశంలోనే సేఫెస్ట్‌ సిటీగా తీర్చిదిద్దం

హైదరాబాద్‌లో పటిష్టమైన శాంతి భద్రతలు ఉన్నాయని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. హైదరాబాద్‌ మహానగరాన్ని దేశంలోనే సేఫెస్ట్‌ సిటీగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఈ మేరకు దేశంలో ఉన్న...

దక్షిణ భారతదేశంలోనే తొలి వేస్ట్‌ ఎనర్జీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినం

ప్రధాని నరేంద్ర మోదీ కంటే ముందుగానే సీఎం కేసీఆర్‌ స్వచ్ఛ్‌ హైదరాబాద్‌ కార్యక్రమాన్ని చేపట్టారని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. పారిశుధ్య నిర్వాహణలో హైదరాబాద్‌ దేశంలోనే ముందుందన్నారు . జీహెచ్‌ఎంసీ పరిధిలో...

ఆరేండ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందింది- మంత్రి కేటీఆర్

ఆరేండ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు మంత్రి కేటీఆర్. స్వరాష్ట్రం ఏర్పడక ముందు హైదరాబాద్ లో ఉన్న అనిశ్చిత వాతావరణం ఇప్పుడు లేదని...

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

దేశీయ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. గురువారం ఉదయం. ఉదయం 9.30 సమయంలో సెన్సెక్స్‌ 156 పాయింట్లు కోల్పోయి 44,023 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 37 పాయింట్ల నష్టంతో 12,900 వద్ద...