19.3 C
Hyderabad
Monday, January 18, 2021

గ్రీన్ ఇండియా ఛాలెంజ్: మొక్కలు నాటిన నటుడు సోనూ సూద్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా సినీ దర్శకుడు శ్రీను వైట్ల ఇచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి సోమవారం రామోజీ ఫిలిం సిటీలో సినీ నటుడు సోనూ సూద్ మొక్కలు నాటారు. 

ఈ సందర్భంగా సోనూ సూద్ మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్  ఆలోచనకు శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. కరోనా, తదనంతర కాలంలో పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకత పెరిగిందన్నారు.  చెట్లు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అనీ, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో నేను ఒకరిగా పాల్గొన్నందుకు ఆనందంగా ఉందని అన్నారు. ఇదే స్ఫూర్తితో లక్షలాది మంది గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ మొక్కలు నాటాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని సోనూ సూద్  పిలుపునిచ్చారు

- Advertisement -

Latest news

Related news

బట్టతలకు రాకుండా ఉండాలంటే..

బట్టతల.. ఈ మాట వింటేనే చాలామందికి భయమేస్తుంది. ఒక్కసారి బట్టతల వచ్చిందంటే ఇక అంతే.. జుట్టంతా ఎక్కడ రాలిపోతుందో అని బెంగ పెట్టుకుంటారు. అసలీ బట్ట తల ఎలా వస్తుంది?...

ఫ్లిప్‌కార్ట్ అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ సేల్స్

రిపబ్లిక్ డే వస్తుందంటే ఈ కామర్స్ సైట్లు భారీగా ఆఫర్లు ప్రకటిస్తాయి. ఈ సారి కుడా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు డిస్కౌంట్ సేల్స్‌ను అనౌన్స్ చేశాయి. అమెజాన్...

కోవిడ్19 సోకిన గబ్బిలం కుట్టిందన్న చైనా సైంటిస్ట్

కోవిడ్-19 సోకిన గబ్బిలాలు తమను కుట్టినట్లు వూహన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (డబ్ల్యూఐవీ) శాస్త్రవేత్తలు చెప్పారని ఇంటర్నేషనల్ మీడియా పేర్కొంది.

స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటే స్టాచ్యూ ఆఫ్ యూనిటీనే బెస్ట్

అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కన్నా గుజరాత్ లోని కెవాడియాలో ఉన్న స్టాట్యూ ఆఫ్ యూనిటీ కే ఎక్కువమంది టూరిస్టులు వచ్చారని ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. రెండేళ్ల క్రితం...