19.4 C
Hyderabad
Monday, November 30, 2020

డార్లింగ్‌ బ‌ర్త్‌డే స‌ర్‌ప్రైజ్ అదుర్స్…

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ అభిమానులకు బర్త్‌డే సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. ఈ రోజు ప్ర‌భాస్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా చిత్రం నుండి స‌ర్‌ప్రైజ్ వీడియో విడుద‌ల చేశారు మేకర్స్. బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్ పేరుతో విడుద‌లైన ఈ వీడియో అభిమానుల ఆనందానికి అవ‌ధులు లేకుండా చేస్తుంది.. ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న అపురూపమైన ప్రేమకథా చిత్రం ‘రాధేశ్యామ్‌’. రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆయన విక్రమాదిత్య పాత్రలో కనిపించనున్నారు. ప్రభాస్‌ సరసన పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రభాస్‌ పుట్టినరోజుని పురస్కరించుకుని తాజాగా చిత్రబృందం తొలి‌ మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేసింది. ‘

రాధే శ్యామ్‌ సినిమాను 2021లో విడుదల చేయనుండ‌గా, ఈ మూవీ  తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాష‌లలో రిలీజ్ కానుంది. అర‌చేతిలో అద్భుత ప్రపంచాన్ని చూపిస్తూ ప్ర‌భాస్, పూజాల  మ‌ధ్య సాగిన రొమాంటిక్ విజువ‌ల్‌ను ఆవిష్క‌రించారు. జ‌స్టిస్ ప్ర‌భాక‌ర‌న్ అందించిన సంగీతం వినసొంపుగా ఉంది. ప్ర‌భాస్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా విడుద‌లైన వీడియో అదుర్స్ అనేలా ఉంది     

- Advertisement -

Latest news

Related news

ఇక్కడ బతికేవారంతా మా బిడ్డలే : సీఎం కేసీఆర్‌

ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో చర్చ జరగాలి. నాయకుల పనితీరును చూసి విచక్షణతో ఆలోచించి ఓటు వేయాలని' సీఎం కోరారు.

ఆలోచించి.. అభివృద్ధికే ఓటేయండి : సీఎం కేసీఆర్

మన చారిత్రక నగరాన్ని కాపాడుకునేందుకు అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఓటేయాలని కోరారు.

మనకు చెప్పే మొఖమా వాళ్లది? : సీఎం కేసీఆర్‌

ఎల్‌ఐసీ, బీహెచ్‌ఈఎల్‌, రైల్వేలు ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నిస్తే.. దాడులు చేసేందుకు.. మాయలు చేసి.. మాటలు చెప్పేందుకు ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్‌కు నాయకులు తరలి వస్తున్నారని సీఎం ముఖ్యమంత్రి తెలిపారు.

వరద సాయాన్ని అడ్డుకోవడం విజ్ఞతనా?

బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఎలాంటి సాయం చేయలేదు. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఆరున్నర లక్షల కుటుంబాలకు వరద సాయం అందజేశామని ముఖ్యమంత్రి తెలిపారు.