బాలీవుడ్ డ్రగ్స్ కేసుపై దర్యాప్తును నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మరింత తీవ్రతరం చేసింది. ఈ కేసుతో సంబంధమున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ హీరోయిన్లు, నటీమణులకు బుధవారం సమన్లు జారీ చేసింది. వారిలో దీపికా పదుకొనె, సారా అలీఖాన్, శ్రద్ధా కపూర్, రకుల్‌ప్రీత్ సింగ్ ఉన్నారు. ఇవాళ రకుల్‌ప్రీత్ ను, శుక్రవారం దీపిక పదుకొనెను, శనివారం సారాఅలీఖాన్, శ్రద్ధాకపూర్ ను విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసుల్లో ఎన్సీబీ ఆదేశించింది. సుశాంత్ మేనేజర్ శృతి మోదీని, ఫ్యాషన్ డిజైనర్ సైమన్ ఖంబట్టాను కూడా గురువారం విచారణకు హాజరుకావాలని పేర్కొంది.