23.6 C
Hyderabad
Saturday, November 28, 2020

తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్ ఇంటికి బాంబు బెదిరింపు కాల్

తమిళ సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ ఇంట్లో బాంబు పెట్టినట్టు వచ్చిన ఓ ఫోన్‌ కాల్‌ కలకలం సృష్టించింది. చెన్నై పోయిస్‌ గార్డెన్‌ ప్రాంతంలోని రజినీకాంత్‌ ఇంట్లో బాంబు పెట్టారని   108 నంబర్‌కు ఓ అజ్ఞాత ఫోన్‌కాల్‌ వచ్చింది. కంట్రోల్‌ రూం ద్వారా అప్రమత్తమైన పోలీసులు.. బాంబు స్క్వాడ్ టీంతో కలిసి రజినీకాంత్‌ ఇంటి దగ్గరికి చేరుకున్నారు. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో పోలీసులు ఇంట్లోకి వచ్చి తనిఖీలు చేపట్టేందుకు కుటుంబసభ్యులు అనుమతివ్వలేదు. దీంతో వారు ఇంటి ఆవరణతోపాటు పరిసరాలను తనిఖీ చేశారు. అనుమానాస్పద వస్తువులు కనిపించకపోవడంతో.. నకిలీ కాల్‌గా తేల్చారు. ఫోన్‌కాల్‌ ఎక్కడినుంచి వచ్చిందనే విషయంపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.

- Advertisement -

Latest news

Related news

మంత్రి ఎర్రబెల్లి.. ఇంటింటి ప్రచారం

హైదరాబాద్‌ నగరంలో కేవలం టీఆర్ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి సాధ్యమయిందని.. పంచాయితీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. మీర్‌పేట హౌసింగ్‌బోర్డు కాలనీ డివిజన్‌లో ఆయన ఇంటింటికీ...

రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఎవరికి అందింది : మంత్రి కేటీఆర్

మతాన్ని అడ్డుపెట్టుకొని ఓట్లు రాబట్టకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని.. మత రాజకీయాలు చేయడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య అని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఆరోపించారు.

చట్టాల రద్దు కోసం.. పట్టుబట్టిన రైతులు

పంజాబ్‌ నుంచి ఢిల్లీలోకి ప్రవేశించేందుకు ఇదే ప్రధాన రహదారి కావడం వల్ల వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రైతులతో పోలీసులు చర్చలు కొనసాగిస్తున్నా.. రైతులు మాత్రం మెట్టు దిగడం లేదు.

హైదరాబాద్‌ అభివృద్ధికి నిబద్ధతతో పనిచేస్తున్నాం: మంత్రి కేటీఆర్

బేంగంపేటలోని మ్యారిగోల్డ్‌ హోటల్‌లో జరిగిన ‘వైబ్రంట్‌ హైదరాబాద్‌’ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆరేండ్ల క్రితం హైదరాబాద్‌లో వ్యాపారులకు అనేక అనుమానాలు ఉండేవని చెప్పారు. ఉద్యమపార్టీ...