27.2 C
Hyderabad
Friday, December 4, 2020

నటి, ఎంపీ నవనీత్ కౌర్ కు కరోనా పాజిటివ్

సినీ నటి, అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ కరోనా వైరస్ బారినపడ్డారు. వారి కుటుంబంలో 10 మందికి వైరస్ సోకింది.. వైరస్‌ బారిన పడిన కుటుంబ సభ్యులను జాగ్రత్తగా చూసుకొనే క్రమంలోనే తనకు కొవిడ్‌ సోకినట్లు ఆమె ఫేస్‌బుక్‌లో వెల్లడించారు. నా కుమార్తె, కుమారుడితో పాటు ఇతర కుటుంబ సభ్యులకూ వైరస్‌ సోకింది. ఓ తల్లిగా వారిని జాగ్రత్తగా చూసుకోవడం నా తొలి కర్తవ్యం అని తెలిపారు. ఈ క్రమంలో ర్యాపిడ్ టెస్టుల్లో భాగంగా ఆమెకు పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్‌గా తేలింది. ఆమెకు కరోనా లక్షణాలేవీ లేకున్నా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. అభిమానుల ఆశీస్సులతో తామంతా కరోనాను జయిస్తామని నవనీత్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో తనను కలిసిన వారు కూడా కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ఇంట్లోనే సురక్షితంగా ఉంటూ ప్రభుత్వం సూచించే మార్గదర్శకాలు పాటించాలని విజ్ఞప్తి చేశారు

- Advertisement -

Latest news

Related news

మహారాష్ట్రలో బీజేపీకి బిగ్ షాక్

మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి గట్టిదెబ్బ తగిలింది. మొత్తం ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగితే.. కేవలం ఒకే ఒక్కచోట కష్టపడి విజయం సాధించింది. అది కూడా స్థానిక సంస్థల...

డిప్యూటీ మేయర్ మళ్లీ గెలిచాడు

గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో కారు దుమ్ము రేపుతోంది. అందరూ ఊహించినట్టుగానే.. టీఆర్ఎస్ అభ్యర్థులు విజయ బావుటా ఎగురవేస్తున్నారు.

కూకట్ పల్లిలో.. టాప్ గేర్

ఉత్కంఠ రేకెత్తించిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల్లో.. కారు జోరు మీదున్నది. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో కాస్త వెనకబడ్డట్టు అనిపించినా.. సాధారణ ఓట్ల లెక్కింపులో.. తొలిరౌండ్ నుంచే దుమ్ము రేపింది.

కారుకు తొలివిజయం

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ ఖాతాలో తొలి విజ‌యం న‌మోదైంది. యూసుఫ్‌గూడ డివిజ‌న్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి రాజ్‌కుమార్ ప‌టేల్ విజ‌యం సాధించారు....