20.1 C
Hyderabad
Sunday, January 17, 2021

నింగికేగిన గాన గంధర్వుడు

సుప్రసిద్ధ  నేపథ్య గాయకుడు, గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ లోకాన్ని విడిచారు. దశాబ్దాల తరబడి అందరినీ అలరించిన అమృత గానం ఆగిపోయింది. ఆయన ఇకలేరంటే అభిమానులు నమ్మలేకుండా ఉన్నారు. శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం కరోనా మహమ్మారిపై సుదీర్ఘ పోరాటం తరువాత ఇక సెలవంటూ తనువు చాలించారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. సంపూర్ణ ఆరోగ్యంగా తిరిగి వస్తారని వేయి దేవుళ్లకు మొక్కుకున్న అభిమానులంతా శోక సంద్రంలో మునిగిపోయారు.

ఎస్పీ బాలు పార్థివదేహానికి చెన్నైకి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమరాయిపక్కంలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు జరగనున్నాయి. భారీ సంఖ్యలో అభిమానులు తరలివస్తున్న నేపథ్యంలో కరోనా జాగ్రత్తలతో భాగంగా డెడ్‌బాడీని నిన్న రాత్రే ఫాంహౌస్‌కు తరలించారు. గాన గంధర్వుడికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది.

బాలు గాయకుడిగా మాత్రమే కాకుండా డబ్బింగ్ కళాకారుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా ప్రతిభను చాటుకున్నారు. కమల్ హాసన్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్, భాగ్యరాజా లాంటి హీరోలకు పలు భాషల్లో గాత్రదానం చేశారు. 1969 లో మొదటిసారిగా నటుడిగా కనిపించిన బాలు.. తర్వాత ఎన్నో తమిళ, తెలుగు చిత్రాల్లో నటించి మెప్పించారు. తనికెళ్ళ భరణి దర్శకత్వంలో తెరకెక్కిన మిథునం సినిమాకు గాను బాలు నంది అవార్డు అందుకున్నారు. 40 ఏళ్ళ సినీ ప్రస్తానంలో 11 భాషలలో, 40 వేల పాటలు, 40 సినిమాలకు సంగీత దర్శకత్వంతో ఉర్రూత లూగించిన బహుముఖ ప్రజ్ఞాశాలి ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం.

- Advertisement -

Latest news

Related news

కొవిడ్ వ్యాక్సిన్ బండికి బాజాభజంత్రీలతో స్వాగతం

కరోనా మహమ్మారిని అంతమొందించేందుకు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం దేశంలోని అన్నీ ప్రాంతాలకు కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేసింది. ఇందులో భాగంగానే ఛత్తీస్‌గఢ్‌లోని జష్పూర్‌లో...

మొదటిరోజు వాక్సినేషన్ విజయవంతం

రాష్ట్రంలో వాక్సినేషన్ ప్రక్రియ మొదటిరోజు విజయవంతంగా ముగిసింది. మొత్తం 4296 మంది ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి ఈరోజు వాక్సిన్ ఇవ్వాల్సి ఉండగా.. 3962 మంది వాక్సిన్ తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా...

1020వ గుండెను కాపాడిన సూపర్ స్టార్

సాటివారికి సాయం చేయడంలో ముందుండే సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల్లోనే కాదు.. తాను నిజంగా కూడా శ్రీమంతుడినే అని నిరూపించుకున్న సంఘటనలు బోలెడున్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. గత...

తొలి బర్డ్ ఫ్లూ కేసు.. నేషనల్ పార్క్ బంద్

ఢిల్లీలో తొలి బర్డ్ ఫ్లూ కేసు నమోదైంది. నగరంలోని నేషనల్ జువాలాజికల్ పార్క్ లో గత సోమవారం ఓ గుడ్లగూబ మరణించింది. దీని శాంపిల్స్ ను భోపాల్ లోని ఐసీఎఆర్...