18.3 C
Hyderabad
Wednesday, October 28, 2020

నిహారిక ఎంగేజ్మెంట్ ముహూర్తం ఫిక్స్….

టాలీవుడ్‌లో ప్రస్తుతం పెళ్లి గోల నడుస్తుంది. వరసగా అన్ని పెళ్లిళ్లు జరుగుతున్నాయి. హీరోలు, దర్శకులు అంతా ఒక్కొక్కరుగా ఇంటి వాళ్లు అవుతున్నారు. నితిన్ కూడా తాజాగా పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు మరో పెళ్లి కూడా జరగబోతుంది. మెగాబ్రదర్‌ నాగ‌బాబు కూతురు నిహారిక వివాహం గుంటూరు ఐజీ ప్రభాకర్‌రావు త‌న‌యుడు చైత‌న్యతో జ‌రగ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఇక స్వయంగా నిహారికే తనకు కాబోయేవాడి గురించి చెప్పడంతో అందరూ షాక్ కి గురయ్యారు. ఇక అప్పటి నుండి వీరి ఎంగేజ్మెంట్ ఎప్పుడు, పెళ్లి ముహూర్తం, ఎప్పుడు అనే ఆతృత అభిమానుల్లో ఎక్కువయింది. కాగా తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో నాగబాబు త‌న‌యుడు, హీరో వ‌రుణ్ తేజ్ నిహారిక ఎంగేజ్‌మెంట్ డేట్‌ను తెలియ‌జేశారు. ఆయన మాట్లాడుతూ ఆగ‌స్టు 13న ఇరు కుటుంబాల పెద్దల స‌మ‌క్షంలో చైత‌న్య, నిహారిక ఎంగేజ్‌మెంట్ జ‌ర‌గ‌నుందని తెలిపారు. 

- Advertisement -

Latest news

Related news

ఢిల్లీపై హైదరాబాదీల విజయం

తప్పకగెలవాల్సిన మ్యాచ్‌లో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టింది. దుబాయ్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 88 పరుగులతో ఢిల్లీ క్యాపిటల్స్ ని చిత్తు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్...

సీఎం చేతుల మీదుగా రేపే ధరణి పోర్టల్‌ ప్రారంభం

మరో చారిత్రక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. రేపు మధ్యాహ్నం పన్నెండున్నరకు సీఎం కేసీఆర్‌ ..మేడ్చల్‌ మల్కాజ్‌ గిరి జిల్లాలోని మూడుచింతలపల్లి గ్రామంలో ధరణి...

ప్రారంభమైన బీహర్ తొలి విడత పోలింగ్

బీహార్‌లో  తొలిదశ ఎన్నిక పోలింగ్‌ ప్రారంభమైంది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆరు జిల్లాల్లోని 71  శాసనసభ స్థానాల్లో పోలింగ్ జరుగనుంది.  తొలివిడుత...

సిద్ధిపేటలో దొరికిన డబ్బు బీజేపీదే: సీపీ జోయల్ డేవిస్

సిద్ధిపేటలో సోదాల ఘటనపై వార్తా ఛానళ్లు, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్‌ స్పష్టం చేశారు. ఈ ఘటన మొత్తం సురభి అంజన్...