25.3 C
Hyderabad
Wednesday, June 3, 2020

పీఎం కేర్స్‌ ఫండ్‌ కు అక్షయ్‌ కుమార్ భారీ విరాళం

INDIA-ARTS-CINEMA-BOLLYWOOD

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌ కుమార్‌ మరోమారు తన మంచి మనసు చాటుకున్నారు. ప్రధాని మోదీ పీఎం-కేర్స్‌ ఫండ్‌కు భారీ విరాళాన్ని ప్రకటించారు. రూ.25 కోట్లు ఇస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా చెప్పారు. కరోనా వైరస్ పై ప్రభుత్వం పోరాడుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ప్రజలను కాపాడేందుకు పీఎం కేర్స్‌ ఫండ్‌ చిన్న విరాళాల్ని కూడా స్వీకరిస్తుందని చెప్పారు. దీని ద్వారా వచ్చిన మొత్తాన్ని ప్రజల ఆరోగ్యాలు కాపాడేందుకు ఉపయోగిస్తామని తెలిపారు.

దీంతో అక్షయ్‌ కుమార్ రూ.25 కోట్లు విరాళంగా ఇస్తున్నట్లు ట్విట్టర్‌ లో చెప్పారు. ఇది మన ప్రజల ప్రాణాలకు సంబంధించిన విషయం. అవసరమైతే దీని కోసం మనం ఏదైనా, ఎలాంటిదైనా చేయాలి. నా సొంత డబ్బు నుంచి రూ.25 కోట్లు పీఎం కేర్స్‌ ఫండ్‌కు విరాళంగా ఇస్తానని ప్రమాణం చేస్తున్నా. జీవితాన్ని కాపాడుదాం. ప్రాణం ఉంటేనే ప్రపంచం ఉంటుందని ఆయన ట్వీట్ చేశారు.

అనంతరం తన భర్త పట్ల తనకు చాలా గర్వంగా ఉందని ఆయన సతీమణి ట్వింకిల్ ఖన్నా ట్వీట్ చేశారు. తను నన్ను గర్వించేలా చేస్తున్నాడు. ఇంత భారీ మొత్తం ఇస్తున్నావు, ఆలోచించవా? అని అడిగినప్పుడు.. తను ప్రారంభంలో నా వద్ద ఏమీ లేదు. కానీ ఇప్పుడు ఇచ్చే స్థాయిలో ఉన్నా. ఏమీ లేని పేదల కోసం నేను చేయగలిగినది కూడా చేయకుండా ఎలా ఉండగలను అని చెప్పాడని ఆమె ట్విట్టర్ లో తెలిపింది.

ఆమె ట్వీట్ తో నెటిజన్లు అక్షయ్‌ పై ప్రశంసిస్తున్నారు. అక్షయ్‌ సార్ మీకు సెల్యూట్.. మీది గొప్ప మనసు. మీది చాలా పెద్ద హృదయం, మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది, లవ్ యూ సర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

- Advertisement -

Latest news

ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం…200 గుడిసెలు బుగ్గిపాలు

దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోని తుగ్లకాబాద్ మురికివాడలోని వాల్మీకి బస్తీలో బుధవారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిప్రమాదం గురించి సమాచారం తెలియగానే తాము 20 అగ్నిమాపక వాహనాలను తీసుకువచ్చి...

Related news

ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం…200 గుడిసెలు బుగ్గిపాలు

దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోని తుగ్లకాబాద్ మురికివాడలోని వాల్మీకి బస్తీలో బుధవారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిప్రమాదం గురించి సమాచారం తెలియగానే తాము 20 అగ్నిమాపక వాహనాలను తీసుకువచ్చి...

తెలంగాణలో నాలుగు రోజులపాటు మోస్తరు వర్షాలు

తెలంగాణపై ఉపరితల ద్రోణి ప్రభావం కొనసాగుతున్నది. దీంతో హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం కురిసింది. హైదరాబాద్‌లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వాన పడింది. దిల్‌సుఖ్‌నగర్‌, కొత్తపేట,...

విద్యుత్ చట్ట సవరణ బిల్లును కేంద్రం ఉపసంహరించుకోవాలి

విద్యుత్ చట్ట -2003 కు కేంద్రప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలను సీఎం కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రతిపాదిత విద్యుత్ సవరణ బిల్లు -2020పై రాష్ట్రాల అభిప్రాయాలు తెలపాలని కేంద్రం కోరిన నేపథ్యంలో.....

తమిళనాడులో వేగంగా విస్తరిస్తున్న కరోనా

తమిళనాడులో కరోనా మరణమృదంగం కొనసాగుతోంది. రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 1162 కరోనా కేసుల నమోదు కావడంతో బాధితుల సంఖ్య  23,495కు పెరిగింది. ఒక్క చెన్నైలోనే 964 పాజిటివ్‌ కేసులు బయటపడ్డంతో...