27.4 C
Hyderabad
Monday, July 13, 2020

బాహుబ‌లి 2ని మించిన బ్లాక్ బ‌స్ట‌ర్ ..!

తెలుగు సినిమా కీర్తి ప్ర‌తిష్ట‌ల‌ని ప‌తాక స్థాయికి చేర్చిన చిత్రం బాహుబ‌లి. ఈ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన బాహుబ‌లి 2 2017లో విడుద‌ల కాగా, ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా 1800 కోట్ల వ‌సూళ్లు చేసింది. ఇంత భారీ స్థాయిలో దేశ వ్యాప్తంగా క‌లెక్షన్స్ రాబ‌ట్టిన ఈ చిత్రం అంద‌రి దృష్టిని ఆకర్షించింది. తాజాగా అమితాబ్ బ‌చ్చ‌న్ త‌న సినిమా బాహుబ‌లి2ని మించి క‌లెక్ష‌న్స్‌ని రాబ‌ట్టింద‌ని పేర్కొన్నారు.

అమితాబ్ న‌టించిన అనేక హిట్ చిత్రాల‌లో అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని ఒక‌టి. ఈ చిత్రం నేటితో 43 ఏళ్ళు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా సెట్‌లోని ఫోటో ఒక‌టి షేర్ చేస్తూ.. బాక్సాఫీస్ గ‌ణాంకాల‌ని షేర్ చేసుకున్నాడు. 43 ఏళ్ళ క్రితం విడుద‌లైన అఅఆ చిత్రం రూ. 7.25 కోట్లు వసూలు చేసింది. ద్రవ్యోల్బణం ప్రకారం లెక్క వేస్తే ఆ కలెక్షన్  ‘బాహుబలి-2’ వసూళ్లను సైతం వెనక్కి నెట్టేదని లెక్క‌లు చేసిన వారు చెప్పుకొచ్చారు. ఈ చిత్రం ఒక్క ముంబైలోనే 25 థియేట‌ర్స్‌లో 25 వారాలు ఆడి భారీ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది.  ఇప్పుడ‌లా లేదు. రోజులు మారాయి అని అమితాబ్ త‌న పోస్ట్‌లో పేర్కొన్నాడు.

1977లో విడుద‌లైన  ‘అమర్ అక్బర్ ఆంటోనీ’  సినిమాను 3,62,50,000 మంది చూశారు . అప్ప‌ట్లో యావరేజ్ టిక్కెట్ రేటు రెండు రూపాయలు. 2017లో బాహుబలి-2 విడుదలైన సమయంలో టిక్కెట్ రేటు రూ. 150. ఈ రేటు ప్రకారం లెక్కవేస్తే… అమితాబ్ మూవీ ఇపుడు రిలీజ్ అయితే రూ. 543 కోట్లు వసూలు చేసేది.   ‘బాహుబలి 2′ చిత్రం హిందీ వెర్షన్ ఇండియాలో దాదాపు 510 కోట్లు వసూలు చేసిన విష‌యం తెలిసిందే. ఈ లెక్క‌ల ప్ర‌కారం బాహుబ‌లి 2ని అఅఆ చిత్రం బీట్ చేసింద‌ని బిగ్ బీ చెబుతున్నారు.

1977లొ విడుదలైన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ ఆ సంవత్సరంలో బిగ్గెస్ట్ గ్రాస్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, రిషి కపూర్, వినోద్ ఖన్నా, షబానా అజ్మీ, నీతూ కపూర్, ప్రాణ్, పర్వీన్ బాబీ తదితరులు నటించారు. మన్మోహన్ దేశాయ్ దర్శకత్వం వహించగా, ఖాదర్ ఖాన్ డైలాగులు అందించారు.

- Advertisement -

Latest news

ఉపాధి, ఇతర రంగాలపై కరోనా ‌తీవ్ర ప్రభావం చూపింది- ఆర్‌బీఐ గవర్నర్

దేశంలో వందేళ్లలో ఎన్నడూలేని పరిస్థితులు నెలకొన్నాయని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ఎస్‌బీఐ బ్యాంకింగ్‌, ఎకనమిక్‌ కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న ఆయన, ప్రస్తుత సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ఆర్‌బీఐ అన్ని...

Related news

ఉపాధి, ఇతర రంగాలపై కరోనా ‌తీవ్ర ప్రభావం చూపింది- ఆర్‌బీఐ గవర్నర్

దేశంలో వందేళ్లలో ఎన్నడూలేని పరిస్థితులు నెలకొన్నాయని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ఎస్‌బీఐ బ్యాంకింగ్‌, ఎకనమిక్‌ కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న ఆయన, ప్రస్తుత సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ఆర్‌బీఐ అన్ని...

అంబర్‌పేట ఫ్లైఓవర్‌ నిర్మాణం త్వరలో పూర్తి:మంత్రి కేటీఆర్

లాక్‌డౌన్‌తో మార్చి నెల నుంచి ఇప్పటివరకు జీహెచ్‌ఎంసీలో నాలుగు రెట్ల వేగంతో పనులను పూర్తిచేశామని, తొమ్మిది నెలల్లో జరగాల్సిన పనులు లాక్‌డౌన్‌ వల్ల రెండు నెలల్లోనే పూర్తయ్యాయని మంత్రి కేటీఆర్‌...

జమ్మూకాశ్మీర్ లో ఎన్ కౌంటర్, ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్‌ లో ఉగ్రవాదులకు చెక్‌ పెడుతున్నాయి భద్రతా బలగాలు. ఉత్తర కశ్మీర్‌ లోని నౌగామ్‌ సెక్టార్‌ లోకి అక్రమంగా చొచ్చుకువచ్చిన ఇద్దరు టెర్రరిస్టులను మట్టుబెట్టాయి. ఉగ్రవాదుల మృతదేహాల వద్ద రెండు...

జపాన్‌లో వరదలు….66మంది మృతి

నేపాల్‌, జపాన్‌ దేశాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. నేపాల్‌ లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వరదలు పోటెత్తుతున్నాయి.వరదల దాటికి వేలాది ఇండ్లు కొట్టుకుపోయాయి. దీనికి తోడు కొండచరియలు విరిగిపడుతుండడంతో...