తమిళ సినీ నటి ఖుష్బూ సుందర్ ఇవాళ బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆమె కాషాయం కండువా కప్పుకున్నారు. గత ఆరేళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆమె ఇవాళ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఏఐసీసీ ప్రతినిధి హోదా నుంచి ఖష్బూను తప్పించడంతో ఆమె ఆ పార్టీకి గుడ్‌బై చెప్పింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నత స్థాయిలో ఉన్న కొందరు .. గ్రౌండ్ రియాల్టీ తెలియకుండానే ఆదేశాలు ఇస్తున్నారని, ఇది నచ్చకనే కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు ఖుష్బూ ఇవాళ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. 2014 నుంచి ఖుష్బూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి ఖుష్బూ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి.