లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ ఫిల్మ్ డైరక్టర్ అనురాగ్ కశ్యప్ .. ముంబైలోని వెర్సోవా పోలీసుల ముందు హాజరయ్యారు. నటి పాయల్ ఘోష్ ఆరోపణలతో పలు విషయాలపై కశ్యప్ ను ప్రశ్నిస్తున్నారు పోలీసులు. అయితే తను అలాంటి వాడిని కాదంటున్నారు ఈ స్టార్ డైరెక్టర్. కావాలనే పాయల్ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తుందంటున్నారు. బాలీవుడ్ లో అనురాగ్ కు మద్దతు పెరుగుతుంది. పాయల్ ది పబ్లిసిటీ స్టంట్ అని మండిపడుతున్నారు పలువురు సినీ ప్రముఖలు