టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ.. తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసాడు. తన సినిమాకి సంబంధించిన సరికొత్త అప్డేట్ను నెట్టింట్లో పోస్ట్ చేశారు. టాలెంటెడ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న సుకుమార్‌తో నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేసాడు. ఈ చిత్రాన్ని ఫాల్కన్ క్రియేషన్స్ బ్యానర్లో కేదార్ సలగంశెట్టి నిర్మిస్తున్నారు. ప్రొడ్యూసర్‌గా ఈయనకు ఇదే తొలి చిత్రం. ఈ సినిమాను కూడా ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం సుకుమార్ పుష్ప చిత్రంతో బిజీగా ఉండగా, విజయ్ దేవరకొండ.. పూరీ దర్శకత్వంలో ఫైటర్ చిత్రం చేస్తున్నాడు.