ప్రముఖ సింగర్ సునీత త్వరలో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టనున్నరు. బిజినెస్ మాన్ వీరపునేని రామ్ ని ఆమె పెండ్లి చేసుకోనున్నరు. ఇద్దరి కుటుంబాల పెద్ద మనుషుల సమక్షంలో సునీత-రామ్ ల పూలుపండ్లు ఘనంగా జరిగినయి.

ఈ విషయం గురించి చెప్తూ.. ఆమె తన ఫేస్ బుక్ ఖాతాలో ‘ప్రతి తల్లిలాగే నేను కూడా నా పిల్లలు చక్కగా జీవితాల్లో స్థిరపడాలని కోరుకుంటున్నాను. అదే సమయంలో నేనూ జీవితంలో సంతోషంగా స్థిరపడాలని ఆశించే అందమైన తల్లిదండ్రులు, పిల్లలు నాకున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాను. నా జీవితంలో అలాంటి మధురక్షణం ఆసన్నమైంది. సంరంక్షేంచే స్నేహితుడిగా, అద్భుతమైన సహచరుడిగా రామ్ నా జీవితంలోకి ప్రవేశించాడు. మేమిద్దరం అతి త్వరలోనే వైవాహికబంధంలోకి అడుగుపెట్టనున్నాం. నా వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచానని అర్థం చేసుకున్న వారందరికీ కృతజ్ఞతలు. ఎప్పటికీ నన్ను సపోర్ట్ చేయాలని ఆశిస్తున్నా’ అని పోస్ట్ చేశిర్రు.