ఆచార్య టీజర్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్ అందించారు ఆచార్య టీమ్. ఈ నెల 29న శుక్రవారం సాయంత్రం 4:05 గంటలకు టీజర్ విడుదల చేయబోతున్నట్టు టీం ప్రకటించింది.
కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. మెగాస్టార్ చిరు, కాజల్ ఇందులో జంటగా నటిస్తుండగా.. రామ్ చరణ్ ఓ ప్రత్యేకపాత్రలో ‘సిద్ధ’ గా కనిపించనున్నాడు.
