పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడిగా యాక్ట్ చేస్తున్న ఆది పురుష్ సినిమా మంగళవారం షూటింగ్ మొదలైంది. బాలీవుడ్ దర్శకుడు ఓం రావుత్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆదిపురుష్’ సినిమాను టీ సిరీస్ బ్యానర్ భూషణ్ కుమార్, కృషన్ కుమార్లతో పాటు ఓంరావుత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ పనులు జరుగుతున్నాయి. ఇక ఇప్పటినుంచి షూటింగ్ కూడా మొదలైంది. వచ్చే ఏడాది ఆగస్ట్ 11న సినిమాను రిలీజ్ చేయనున్నట్టు డైరెక్టర్ ఓం రావుత్ ప్రకటించారు. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, సైఫ్ ఆలీఖాన్ రావణాసురుడిగా నటిస్తున్నారు.
#Adipurush aarambh. #Prabhas #SaifAliKhan #BhushanKumar @vfxwaala @rajeshnair06 @TSeries @retrophiles1 #TSeries pic.twitter.com/LbHvEFhmFF
— Om Raut (@omraut) February 2, 2021