23.8 C
Hyderabad
Sunday, February 28, 2021

కొత్త సినిమాలు ప్లాన్ చేస్తున్నఅక్కినేని యంగ్ హీరో

మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ అంటూ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అక్కినేని యంగ్ హీరో అఖిల్ జోరు మీదున్నాడు. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ మూవీ సమ్మర్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమా తర్వాత అఖిల్ సురేందర్ రెడ్డితో ఓ స్పై థ్రిల్లర్ మూవీ చేసేందుకు సిద్ధమవుతున్నాడు.
దేశమంతా తన వెబ్ సిరీస్ తో ఊపేస్తున్న ఫ్యామిలీ మేన్ రాజ్-డీకేల జంటతో కలిసి ఓ యాక్షన్ సినిమా ప్లాన్ చేశాడట. ఈ సినిమాను అశ్వనీదత్ వైజయంతీ మూవీస్ పతాకంపై తెరకెక్కిస్తారట. ఇప్పటి వరకు ఒక్క హిట్ కూడా ఖాతాలో వేసుకోని అఖిల్.. ఈ సినిమాలతో అయినా ఖాతా తెరుస్తాడేమో చూడాలి అంటున్నారు సినీ విమర్శకులు.

- Advertisement -

Latest news

Related news