32.7 C
Hyderabad
Monday, March 1, 2021

అల్లు అర్జున్ కారావాన్ కు ప్రమాదం

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కారావాన్ కు ప్రమాదం జరిగింది. ఖమ్మం సమీపంలోని సత్యనారాయణ పురం దగ్గర ఈ ప్రమాదం జరిగింది. అయితే ప్రమాదం జరిగిన కార్‌వాన్ లో బన్నీ లేడని, కేవలం కొందరు మేకప్ సిబ్బంది మాత్రమే ఉన్నట్లు పుష్ప సినిమా యూనిట్ ప్రకటించింది. ప్రమాదంపై అల్లుఅర్జున్ ఆరా తీసినట్లు సమాచారం.

అల్లు అర్జున్ కార్ వాన్ కు ప్రమాద వార్త తెలియగానే ఆయన అభిమానులు ఆందోళనకు గురైయ్యారు. అందులో బన్నీ లేకపోవడంతో వారు ఊపిరిపీల్చుకున్నారు. ఇటీవల రంపచోడవరం, మారేడు మిల్లి ప్రాంతాల్లో రెండు కీలక షెడ్యూల్స్ ని పుష్ప టీం పూర్తి చేసింది.

- Advertisement -

Latest news

Related news