29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

అల్లు అర్జున్ ‘పుష్ప’ రిలీజ్ డేట్ ఫిక్స్

క్రేజీ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తోన్న ‘పుష్ప’ రిలీజ్ డేట్ ని ప్రకటించారు. పాన్ ఇండియా లెవల్లో తీస్తోన్న ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. తెలుగుతోపాటు మరో నాలుగు భాషల్లో ఈ సినిమా రిలీజ్ అవ్వనుంది. శేషాచలం అడువుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తీస్తోన్న ఇందులో అర్జున్ మాస్ లుక్ తన అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ‘పుష్ప’ రెగ్యులర్ షూటింగ్ నవంబర్ లో ప్రారంభమైంది. ఈ సినిమాను స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగష్టు 13న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇందులో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం రంపచోడవం, మన్యం  అడవుల్లో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

- Advertisement -

Latest news

Related news