23.5 C
Hyderabad
Sunday, January 24, 2021

అల్లు అర్జున్ ర్యాప్ సాంగ్ విన్నారా?

మెగా ఫ్యామిలీలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. తన మొదటి చిత్రం నుంచి రీసెంట్ బ్లాక్ బస్టర్ అయిన అల వైకుంఠపురంలో వరకూ తన మూవీ జర్నీ ఎలా సాగిందో అందరికీ తెలుసు. ఈ జర్నీనే ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. అదెలా అనుకుంటున్నారా.. “జర్నీ ఆఫ్ అల్లు అర్జున్” పేరుతో ఇప్పుడో ర్యాప్ సాంగ్ ట్రెండ్ అవుతోంది.


మన టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. అల వైకుంఠపురంలో మూవీతో.. రీసెంట్‌గా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ సినిమా రిలీజై ఏడాది అవుతున్న సందర్భంగా.. సోమ‌వారం రాత్రి రీయూనియ‌న్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీలో ఫీలిం యూనిట్ ఇంకా నటీ నటులంతా కలిసి సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా బన్నీ మాట్లాడుతూ.. సంగీత దర్శకుడు తమన్‌ను పొగడ్తలతో ముంచేశాడు. వన్‌ బిలియన్‌ ఆల్బమ్‌ అడిగితే.. టూ బిలియన్ అల్బమ్‌ ఇచ్చాడంటూ తమన్‌కు థ్యాంక్స్ చెప్పాడు. అయితే తమన్‌ మాత్రం బన్నీపై ఉన్న ప్రేమను పాట రూపంలో ప్రజెంట్ చేశాడు. జర్నీ ఆఫ్ అల్లు అర్జున్ పేరుతో ఒక వీడియో రూపొందించి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. అల్లు అర్జున్‌ మొదటి సినిమా గంగోత్రి నుంచి అల వైకుంఠపురములో వరకూ సినిమాలు, అందులో పాత్రలను గుర్తు చేస్తూ సాగే ర్యాప్‌ సాంగ్‌ ఇది. యూట్యూబ్‌లో ఈ సాంగ్ బాగా ట్రెండ్ అవుతుంది. అల్లు అర్జున్ ర్యాప్ సాంగ్ పేరుతో హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండ్ అవుతుంది.

- Advertisement -

Latest news

Related news

బుడ్డోడి టాలెంట్ కి మంత్రి కేటీఆర్ ఫిదా

ఇండియాలో టాలెంట్ కు కొదవ లేదు. ఏ మూల చూసినా.. ప్రతీ ఒక్కరి దగ్గర ఏదో ఒక స్పెషల్ టాలెంట్ ఉంటుంది. కాస్త ఎంకరేజ్మెంట్, ట్రైనింగ్ ఇస్తే.. ప్రపంచాన్ని ఓ...

సుధీర్ అదరగొట్టేశాడు!

బుల్లితెర స్టార్ హీరో సుధీర్ జాతీయ స్థాయిలో అదరగొట్టేశాడు. జబర్దస్త్, ఢీ వంటి షోలతో పాటు.. ప్రత్యేక సందర్భాల్లో ఈవెంట్లలో కూడా తన టైమింగ్,...

జాతి నిర్మాణంలో సాహిత్యం పాత్ర కీలకం: ఎమ్మెల్సీ కవిత

మెతుకుసీమ సాహితీ సాంస్కృతిక సంస్థ వారి ఆధ్వర్యంలో 610 మంది కవుల భాగస్వామ్యంతో హైదరాబాద్ లో జరిగిన పద్య ప్రభంజనం-దేశభక్తి పద్య బృహత్ సంకలనం ఆవిష్కరణోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత...

ట్రంప్ ఇప్పుడు ఏం చేస్తున్నారు?

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొన్నటివరకూ వైట్ హౌస్‌ను వీడనని మారాం చేశారు. కానీ కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాత వీడక తప్పదు కదా. అందుకే అయిష్టంగానే వైట్...