అల్లు అర్జున్ గారాలపట్టి అల్లు అర్హ చిలిపి మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా అర్హ అల్లరి డైలాగ్ చెప్పడాన్ని వీడియో తీసిన బన్నీ దాన్ని తన ఇన్ స్టాలో షేర్ చేశాడు. అర్హ చిలిపి డైలాగ్ కి బన్నీ అభిమానులతోపాటు అర్హ అభిమానులు కూడా ఫిదా అవుతున్నారు.
‘బెండకాయ దొండకాయ నువ్వు నా గుండెకాయ’ అని అర్హ తన తండ్రి బన్నీనుద్దేశించి అనడాన్ని బన్నీ వీడియోలో బంధించాడు. ఆమె చిలిపి డైలాగ్ వినగానే వీడియో తీస్తున్న బన్నీ నవ్వు ఆపుకోలేక ఫకఫక నవ్వేశాడు. గతేడాది మార్చి 1న తీసిన వీడియోని బన్నీ తాజాగా తన అభిమానులతో పంచుకున్నారు.
‘ఐ మిస్ యు అర్హ’ అంటూ బన్నీ ఎమోషనల్ అయ్యాడు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వం వహిస్తోన్న‘పుష్ప’ సినిమా షూటింగ్ కోసం బన్నీ కేరళ వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను ఆగస్టు 13న విడుదల చేస్తున్నట్టు రెండు రోజుల క్రితమే చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది.