యాంకర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి,మెల్లగా సినిమాల్లో కూడా ఎంటర్ అయ్యి మంచి క్రేజ్ సంపాదించుకుంది యాంకర్ అనసూయ. అంతే కాదు, ఓ వైపు సినిమాల్లో సీరియస్ సబ్జెక్ట్ ఉన్న కథల్లో నటిస్తూ.. మరోవైపు స్పెషల్ సాంగ్స్ తో కూడా అలరిస్తుంది. ఇప్పటికే ‘విన్నర్’, ‘ఎఫ్2’ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్‌తో అదరగొట్టింది. ఇప్పుడు మరో సారి స్పెషల్ సాంగ్‌తో అలరించేందుకు రెడీ అయింది. కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా కౌశిక్ దర్శకత్వంలో వస్తున్న ‘చావు కబురు చల్లగా’ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కోసం.. అనసూయ పెర్ఫామెన్స్ చేయబోతోంది. అనసూయ కనిపించే ఈ సాంగ్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని చిత్రయూనిట్ చెప్తోంది.