29.8 C
Hyderabad
Sunday, February 28, 2021

కొత్తలుక్ తో అదరగొట్టేసిన బాలయ్య.. బాక్సాఫీస్ షేక్ చేస్తాడా?

బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో బాలకృష్ణ స్టైలిష్ గా కనిపించనున్నారు. ఈ మేరకు బాలయ్య స్టైలిష్ లుక్ ఉన్న పోస్టర్ ను విడుదల చేస్తూ.. మే 28న సినిమా రిలీజ్ చేస్తామని ప్రకటించారు. సింహా, లెజెండ్ లాంటి బ్లాక్ బ్లాస్టర్ హిట్లు ఇచ్చిన బోయపాటి దర్శకత్వంలో బాలయ్య మరోసారి అదిరిపోయే లుక్ తో అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు.
ఇప్పటికే బాలయ్యకు రెండు హిట్ సినిమాలిచ్చిన బోయపాటి.. తాజా చిత్రంతో హ్యాట్రిక్ కొట్టడం ఖాయమంటున్నారు నందమూరి అభిమానులు. అదిరిపోయే డైలాగ్ తో రిలీజ్ చేసిన టీజర్ కి యూట్యూబ్ లో సూపర్ రెస్పాన్స్ వచ్చింది. డైలాగులు, యాక్షన్, స్టైలిష్ లుక్ తో బాలయ్య, బోయపాటి కలిసి ఈసారి బాక్సాఫీస్ బద్దలు చేస్తారంటున్నారు సినీ ప్రేమికులు. ఇప్పటికే 60శాతం షూటింగ్ పూర్తయింది. ఫిబ్రవరి మొదటి వారంలో మిగతా షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. వేసవి కానుకగా సినిమాను ప్రేక్షకులకు అందిస్తామని మే 28 తేదీని కూడా ప్రకటించేశారు.

- Advertisement -

Latest news

Related news