23.8 C
Hyderabad
Sunday, February 28, 2021

ఇద్దరు విలన్లతో బాలయ్య భారీ యాక్షన్.. విలన్స్ ఎవరంటే..

బాలకృష్ణ, బోయపాటి కాంబోలో సినిమా అంటే మామూలుగా ఉండదు. అందులోనూ హై ఓల్టేజ్ యాక్షన్ సినిమా అని టీజర్ చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఈ సినిమాలో బాలయ్య ఎలివేషన్ ను మరింత పెంచేందుకు ఈ సినిమాలో ఇద్దరు విలన్లు ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారట డైరెక్టర్.


ఇప్పటికే ఈ సినిమాలో ఒక విలన్ గా బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టిని ఫిక్స్ చేశారు. మరో విలన్ గా టాలీవుడ్ హీరో శ్రీకాంత్ ను అనుకుంటున్నట్లు సమాచారం. మరి ఇద్దరి విలన్లతో బాలయ్య భారీ యాక్షన్ సినిమా అంటే ఏ రేంజ్ లో ఉంటుందో అని ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు.

- Advertisement -

Latest news

Related news