29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

బాలయ్య బోయపాటి సినిమాకు టైటిల్ కన్ఫ్యూజన్

నటసింహం బాలకృష్ణ, మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను కాంబో అంటేనే పెద్ద సెన్సేషన్. ‘సింహా’, ‘లెజెండ్‌’ ఈ రెండు సినిమాలతో వాళ్ల కాంబో ఎలా ఉంటుందో ఒక అంచనా వేయొచ్చు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో మూడోసారి సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ కు పండగే. ఇప్పటికే రిలీజయిన టీజర్‌ ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. టీజర్ వచ్చింది, రిలీజ్ డేట్ వచ్చేసింది. అంతా బాగానే ఉంది కానీ.. సినిమా టైటిల్‌ విషయంలోనే ఇప్పటి వరకూ క్లారిటీ లేదు. సోషల్‌ మీడియాలో ‘మోనార్క్’, ‘సూపర్ మ్యాన్’ అనే టైటిల్స్.. వైరల్ అవుతున్నాయి. కానీ బోయపాటి అలాంటి టైటిల్స్ పెట్టే ఛాన్స్ తక్కువని చెప్పకనే చెప్పొచ్చు. అయితే ‘బలరామ్‌’, ‘నృసింహ’, ‘పరాక్రమ’, ‘మహేంద్ర’ వంటి టైటిల్స్‌ని కూడా పరిశీలిస్తున్నట్టు ఇండస్ట్రీలో టాక్. వీటిని ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా సజెస్ట్ చేస్తున్నారట. మరి మాస్ అండ్ పవర్ ఫుల్ టైటిల్స్ పెట్టే బోయపాటి వాటిలో ఏదైనా సెలక్ట్ చేస్తాడో లేదా మరో కొత్త టైటిల్ పెడతాడో వేచి చూడాల్సిందే..

- Advertisement -

Latest news

Related news