29.3 C
Hyderabad
Monday, March 1, 2021

కామెడీ బ్రహ్మ బర్త్ డే ఈ రోజు

వెయ్యి సినిమాలకు పైగా నటించి, మూడు దశాబ్దాలకు పైగా తెలుగు ప్రేక్షకులను నవ్వించి, నవ్విస్తున్న హాస్యబ్రహ్మ బ్రహ్మానందం పుట్టినరోజు నేడు.


బ్రహ్మి గురించి అతను నటించిన పాత్రల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. బ్రహ్మి స్క్రీన్ మీద కనిపించినగానే ఎందుకో తెలీదు, ఆటోమేటిక్ గా నవ్వొచ్చేస్తుంది. కామెడీ చేయడంలో ఆయనదొక డిఫరెంట్ స్టైల్. ఇలాంటి క్యారెక్టర్, ఇలాంటి హావభావాలు మరెవరికీ సాధ్యం కావు అన్నంతగా మన సినిమాల్లో ఆయన్ మార్క్ కనిపిస్తుంటుంది.

ఈ రోజే మొదలు
బ్రహ్మీ కెరీర్ లో ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే.. అతని మొదటిసారిగా మేకప్ వేసుకుంది కూడా ఇదే రోజున. అంటే.. బ్రహ్మీ తన పుట్టినరోజు నాడే యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేశారు. నరేశ్ హీరోగా నటించిన ‘శ్రీ తాతావతారం’ అనే మూవీలో మొదటిసారిగా బ్రహ్మీ నటించారు. 1985, ఫిబ్రవరి 1న హైదరాబాద్ వెస్లీ కాలేజీలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు హీరో నరేశ్‌తో తీసిన తొలి షాట్ తో బ్రహ్మానందం నట జీవితం మొదలైంది. ఇక ఆ తర్వాత జంధ్యాల అహ నా పెళ్లంట మూవీతో ఫుల్ ట్రాక్ లో వచ్చేశాడు బ్రహ్మి.

ఇంట్రెస్టింట్ ఫ్యాక్ట్స్
బ్రహ్మి తన కెరీర్ లో పలు భాషల్లో వెయ్యికి పైగా సినిమాల్లో నటించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు.
బ్రహ్మి ప్రతిభకు భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ ఇచ్చి సత్కరించింది.
ఉత్తమ హాస్యనటుడిగా బ్రహ్మి ఐదు నంది అవార్డులు, ఓ ఫిలిం ఫేర్ అవార్డ్ అందుకున్నారు.
మనకు తెలిసిన బ్రహ్మి సినిమాల్లోకి రాకముందు తెలుగు సాహిత్యంలో ఎంఏ చేసి, తర్వాత అత్తిలిలో తొమ్మిదేళ్ల పాటు ఉపాధ్యాయుడిగా పనిచేశారు.
బ్రహ్మికి పెయింటింగ్ అంటే ప్రాణం.ఇప్పటికీ ఖాళీ రోజుల్లో ఆర్ట్స్ వేస్తుంటాడు.
బ్రహ్మీకి వంట చేయడమంటే కూడా బాగా ఇష్టం.
బ్రహ్మకి పుస్తకాలంటే ప్రాణం. ఇప్పటికీ స్పిరిచ్యువల్, మిథలాజికల్ పుస్తకాలు చదువుతుంటాడు.
బ్రహ్మానందం గారింట్లో జంధ్యాల గారి పెద్ద ఫొటో ఒకటుంటుంది. తన కెరీర్ కు పునాదులు వేసిన జంధ్యాల గారంటే బ్రహ్మికి ఎనలేని అభిమానం.

మనలో ఒకడిగా..
బ్రహ్మి చేసే క్యారెక్టర్స్.. క్యారెక్టర్ పేర్లు, అతను చెప్పే డైలాగులు కేవలం సినిమాతో ఆగిపోవు. బ్రహ్మానందం మన రోజువారీ లైఫ్ లో భాగం. మనం రోజూ మాట్లాడే మాటల్లో, సోషల్ మీడియా మీమ్స్ లో.. నలుగురు కలిసినప్పుడు మాట్లాడుకోడానికి, సెటైర్స్ వేసుకోడానికి.. ఇలా మనలో కలిసిపోతాడు ఆయన.
అర‌గుండు, ఖాన్‌దాదా, మైఖెల్ జాక్సన్‌, మెక్‌డోవెల్ మూర్తి, భ‌ట్టు, గ‌చ్చిబౌలి దివాక‌ర్, ప‌ద్మశ్రీ‌, కిల్ బిల్ పాండే, ప్రణ‌వ్‌, జ‌య‌సూర్య ఇలా బ్రహ్మీకి బోలెడు పేర్లున్నాయి. ఖాన్‌తో గేమ్స్ ఆడకు.. శాల్తీలు లేచిపోతాయ్.. అంటూ సీరియస్ గా నటిస్తూ.. కామెడీ చేయాలన్నా.. నెల్లూరు పెద్దా రెడ్డి ఎవరో తెలీదా.. అంటూ నెవ్వర్ బిఫోర్ బిల్డప్ ఇవ్వాలన్నా.. ఇరుకుపాలెం వాళ్లంటే ఎకసెక్కాలుగా ఉందా అంటూ అమాయకత్వానికి వెటకారాన్ని జోడించాలన్నా.. అది వన్ అండ్ ఓన్లీ బ్రహ్మికే సాధ్యం. అరగుండుతో మొదలైన బ్రహ్మి కామెడీ ఎక్స్ ప్రెస్ మూడు దశాబ్దాల పాటు ఎక్కడా ఆగలేదు. చ‌రిత్ర దేముందిరా, చింపేస్తే చిరిగిపోతుంది అంటాడు.. కానీ బ్రహ్మి చ‌రిత్ర మాత్రం చిరిగిపోయేది కాదు, చెరిగిపోయేది కాదు.

- Advertisement -

Latest news

Related news