26.8 C
Hyderabad
Thursday, February 25, 2021

ప్రభాస్ తో నటించే బంప‌ర్ ఆఫ‌ర్‌

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో రాబోయే సినిమాలో నటించే అవకాశాన్ని మేకర్స్ కల్పించారు. తాజాగా ఈ సినిమా కోసం ‘కాస్టింగ్ కాల్’ నిర్వహిస్తున్నారు దర్శక నిర్మాతలు. వైజయంతిలో మూవీస్ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్ సినిమా ఇదేనని, రూ. 300 కోట్లతో ఈ సినిమాను ప్లాన్ చేసినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. మహానటి తర్వాత దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత నాగ్ అశ్విన్ ప్రభాస్ తో సినిమా తీయనున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో దీపిక పదుకొనే, అమితాబ్ బ‌చ్చ‌న్ ముఖ్య పాత్ర‌ల‌లో నటించనున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు.

ప్రభాస్ ఇటీవలే రాధే శ్యామ్ షూటింగ్ పూర్తి చేశాడు. త్వరలోనే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ తోపాటు ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ రెగ్యులర్ షెడ్యూల్ లో పాల్గొంటారు. వీటి తర్వాతే నాగ్ అశ్విన్ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

- Advertisement -

Latest news

Related news