స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల ఆహా ఓటీటీ ప్లాట్‌ఫాంలో సమంత హోస్టు చేస్తున్న సామ్ జామ్ షోలో పాల్గొన్నారు. తన తండ్రి అల్లు అరవింద్ తో కలిసి పాల్గొన్న బన్నీ ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. సమంత కూడా ఎక్కడ తగ్గలేదు. తండ్రి కొడుకుల నుంచి ఆసక్తికర సమాధానాలను రాబట్టింది. షోలో భాగంగా ఫ్యాన్స్ తో బన్నీ ఇంటరాక్ట్ అయ్యాడు. వారి ప్రశ్నలకు బన్నీ ఆన్సర్లు ఇచ్చాడు. అయితే ఈ సెషన్ ఆహా ఓటీటీలో ప్రసారం కాలేదు. దీంతో ఈ సెషన్ ని అన్‌సీన్ వీడియోగా ఆహాలో విడుదల చేశారు. ఇందులో బన్నీ ఫాన్స్ ప్రశ్నలకు ఆన్సర్లు ఇచ్చాడు. ప్రస్తుతం బన్నీ పుష్ప షూటింగ్ కోసం రంపచోడవరంకు వెళ్లగా అక్కడ ఆయనకు జనాలు నీరాజనాలు పలికిన విషయం తెలిసిందే.