29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

ఆర్జీవీకి నో చెప్పిన సెన్సార్ బోర్డ్.. ఎందుకు?

రామ్ గోపాల్ వర్మకు సెన్సార్ బోర్డ్ షాకిచ్చింది. గతేడాది జరిగిన దిశ అత్యాచారం నేపథ్యంలో ఆర్జీవీ రూపొందించిన దిశ ఎన్కౌంటర్ సినిమాకు సెన్సార్ బోర్డు నో చెప్పింది. సినిమాకు సెన్సార్ ఇవ్వాలా? వద్దా? అని సెన్సార్ బోర్డు కమిటీ తేల్చలేకపోయింది.

నిజమైన ఎన్ కౌంటర్ సీన్లను పోల్చి తీసిన ఆర్జీవీ దిశ సినిమాను నలుగురు సభ్యులు గల సెన్సార్ బృందం రిజెక్ట్ చేసింది. సెన్సార్ బోర్డు తన సినిమాను రిజెక్ట్ చేయడంతో వర్మ రివిజన్ కమిటీకి వెళ్లనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై దిశ తల్లదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సెన్సార్ బోర్డు సైతం రిజెక్ట్ చేయడంతో దిశ సినిమా రిలీజ్ అవుతుందా? లేదా? అనేది సందేహంగా మారింది.

- Advertisement -

Latest news

Related news