గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ-శృతిహాసన్ నటించిన చిత్రం క్రాక్. తాజాగా ఇందులోని ‘కట కట కటారోడు..కస కస కసాయోడు..కరకు నా కొండే అంటూ’ సాగే ఈ పాటను చిత్ర వర్గాలు రిలీజ్ చేశారు. డిఫరెంట్ స్టైల్ లో సాగే ఈ సాంగ్ మాస్ ఆడియెన్స్ తోపాటు మ్యూజిక్ లవర్స్ ను అలరిస్తోంది. ఈ సాంగ్ లో సముద్రఖని, వరలక్ష్మీ శరత్‌కుమార్ బ్లాక్ అండ్ వైట్ బ్యాక్ డ్రాప్ గెటప్ లో ఊర మాస్ లా కన్పించారు. జనవరి 9న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది.