డైరెక్టర్ కృష్ణవంశీ చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న చిత్రం ‘రంగమార్తాండ’. మరాఠీ చిత్రం ‘నటసామ్రాట్’కు ఇది రీమేక్. ఈ సినిమాకు సంబంధించి కృష్ణవంశీ తాజాగా సోషల్ మీడియా వేదికగా ఓ అప్డేట్ను వదిలారు. గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి పాటలు రాయడం స్టార్ట్ చేశారని తెలుపుతూ.. ఓ ఫొటోని షేర్ చేశారు. ”రంగమార్తాండ.. గురూజీ మొదలెట్టారు.. అద్భుతమైన పదాలు జీవితంలో భాగం కాబోతున్నాయి..” అంటూ కృష్ణవంశీ షేర్ చేసిన ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రానికి మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ప్రకాష్‌రాజ్, రమ్యకృష్ణ, అనసూయ వంటివారు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.