32.3 C
Hyderabad
Thursday, February 25, 2021

పుష్ప రిలీజ్ డేట్ పై రగడ!

స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌ ‘పుష్ప’ సినిమా ఆగష్టు 13న విడుదల కానుందని ఇటీవల చిత్ర నిర్మాతలు ప్రకటించారు. అయితే పుష్ప రిలీజ్ డేట్ ప్రకటించడంపై సినిమా డైరెక్టర్ సుకుమార్ అసంతృప్తిగా ఉన్నారని టాక్ విన్పిస్తోంది. ఇంకా 170 రోజుల షూటింగ్ జరపాల్సి ఉండగా ఇలా ఆదరబాదరగా రిలీజ్ డేట్ ప్రకటించడం తనపై ఒత్తిడి పెంచుతుందని డైరెక్టర్  భావిస్తున్నారట. అయితే పుష్ప రిలీజ్ డేట్ ప్రకటన వెనుక బన్నీ ఉన్నట్లు సమాచారం. ఎందుకంటే తన తదుపరి ప్రాజెక్టు డైరెక్టర్ కొరటాల శివతో చేయనున్నారు. ప్రస్తుతం కొరటాల మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య చేస్తున్నారు. ఇది మే 13న రిలీజ్ కానుంది. ఆ తర్వాత డైరెక్టర్ కొరటాల శివ ఫ్రీ అవుతారు. దీంతో దర్శకుడిని వెయిట్‌ చేయించడం ఇష్టం లేక పుష్ప సినిమా షూటింగ్ ను తొందర పెడుతున్నట్లు టాక్. త్వరగా షూటింగ్ చేసి అనుకున్న తేదీకి పుష్పని రిలీజ్ చేస్తారా లేక వాయిదా వేస్తారా అన్నది మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది.

ప్రస్తుతం తెలంగాణలోని ఖమ్మం జిల్లలో ఉన్న మోతుగూడెంలో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. మైత్రీమూవీ మేకర్స్‌ పతాకంపై నిర్మిస్తున్నఈ సినిమాలో రష్మిక మందనా హీరోయిన్గా నిటిస్తున్నారు. దీనికి దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందిస్తున్నారు.

- Advertisement -

Latest news

Related news