29.3 C
Hyderabad
Monday, March 1, 2021

‘రెడ్’ ఫస్ట్ డే కలెక్షన్లు ఎంతో తెలుసా..

రామ్ పోతినేని నటించిన ‘రెడ్’ సినిమా సంక్రాంతి సందర్భంగా 690 థియేటర్లలో రిలీజై విజయవంతంగా ఆడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో బంపర్ కలెక్షన్లతో దూసుకుపోతుంది. తొలిరోజు రెడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్ పై ఒక లుక్కేస్తే.. తెలంగాణ, ఏపీలో కలిపి రూ.6.7 కోట్లు వసూలు చేసింది.  

50% ఆక్యుపెన్సీతో థియేటర్లు నడుస్తున్న రెడ్ మూవీకి ఈ రేంజ్ లో కలెక్షన్లు రావడం అంటే మాములు విషయం కాదు. రామ్ పోతినేని కెరీర్ లో ఇది మంచి ఓపెనింగ్ అని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇక రెండో రోజు, వీకెండ్ లలో మరిన్ని కలెక్షన్లు రావడం ఖాయమని రెడ్ సినిమా ప్రొడ్యూసర్స్ భావిస్తున్నారు.

స్రవంతి రవి కిషోర్ నిర్మించిన ఈ సినిమాకు కిషోర్ తిరుమల దర్శకత్వం వహించారు. రామ్ సరసన నివేదా పేతురాజ్‌, మాళవికా శర్మ, అమృతా అయ్యర్‌ హీరోయిన్లుగా నటించారు.

రామ్ గత సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’ మొదటిరోజు 7.5 కోట్లు వసూలు చేసి.. ఆయన కెరీర్‌లోనే బెస్ట్ ఫస్ట్ డే కలెక్షన్లు రికార్డు క్రియేట్ చేసింది.

ఏరియాల వారీగా..

నైజాం-రూ.2.19 కోట్లు

సీడెడ్- రూ.1.17 కోట్లు

నెల్లూరు-రూ.36 లక్షలు

గుంటూరు- రూ.46.5 లక్షలు

కృష్ణా-రూ.35.3 లక్షలు

వెస్ట్-రూ.95.7 లక్షలు

ఈస్ట్-రూ.63.85 లక్షలు

ఉత్తరాంధ్ర-రూ.53 లక్షలు

- Advertisement -

Latest news

Related news