కేజీఎఫ్‌కు సీక్వెల్‌గా రాబోతున్న కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా టీజర్ యూట్యూబ్ లో దూసుకుపోతుంది. మిలియన్ల వ్యూస్, లైక్స్ తో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ సినిమా సాధించని రీతిలో రికార్డులు బ్రేక్ చేస్తోంది. కేజీఎఫ్ 2లో విలన్ పాత్ర పోషిస్తున్న సంజయ్ దత్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికర అంశాలను వెల్లడించారు.
డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో పనిచేయడం చాలా సౌకర్యంగా ఉందన్నారు. సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరి మధ్య ఫ్రెండ్ షిప్ ఏర్పడిందని, సినిమాపై ఆయన తనతో ఎన్నో అభిప్రాయాలను పంచుకున్నారన్నారు. తన సినీ కెరీర్లో చాలా రకాలు పాత్రలు పోషించానని, అయితే అధీర పాత్రను బాగా ఎంజాయ్ చేశానన్నారు. కేజీఎఫ్ కంటే కేజీఎఫ్ 2లో యాక్షన్ సన్నివేశాలను ఇంకా అద్భుతంగా తీశారన్నారు. ఈ చిత్రంలో యశ్ కు పోటీగా తాను నటించానన్నారు. అధీర పాత్ర కోసం చాలా శ్రమించానని, మేకప్ వేసుకునేందుకే గంటన్నరకు పైగా సమయం పట్టేదన్నారు.