ప్రభాస్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఆదిపురుష్ సినిమా షూటింగ్ సెట్స్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ముంబైలోని గోరేగావ్ ఫిల్మ్ స్టూడియోలో మొదటిరోజు షూటింగ్ జరుగుతుండగా.. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు.
గ్రాఫిక్స్ కోసం వేసిన గ్రీన్ స్క్రీన్ క్రోమా సెటప్ పూర్తిగా కాలిపోయింది. గ్రీన్ స్క్రీన్ కాలిపోవడంతో భారీగా ఆస్తి నష్టం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో చిత్ర యూనిట్ అంతా అక్కడే ఉన్నప్పటికీ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. డైరెక్టర్ ఓం రౌత్ బృందమంతా క్షేమంగా ఉన్నారని సమాచారం. ఈరోజు షూటింగ్ లో హీరో ప్రభాస్, విలన్ సైఫ్ అలీ ఖాన్ పాల్గొనలేదు.
