29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

‘బ్యాక్ డోర్’తో ఆఫర్ కొట్టేసిన పూర్ణ

నంది అవార్డు గ్రహీత కర్రి బాలాజీ  దర్శకత్వంలో రూపొందుతున్న విభిన్న కథాచిత్రం ‘బ్యాక్ డోర్’ షూటింగ్ పూర్తై పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రారంభమైంది. ‘ఆర్కిడ్ ఫిలిం స్టూడియోస్’ పతాకంపై బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూర్ణ ప్రధాన పాత్ర  పోషిస్తోంది. ‘పూర్ణ పెర్ఫార్మెన్స్, ఆమె గ్లామర్ ‘బ్యాక్ డోర్’ చిత్రానికి ప్రధాన ఆకర్షణలుగా నిలుస్థాయి” అని డైరెక్టర్ కర్రి బాలాజీ అన్నారు. ప్రొడ్యూసర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..‘బ్యాక్ డోర్’ సినిమా చేస్తుండగానే పూర్ణకి బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్ లో సినిమా రావడం, అలాగే కంగనా రనౌత్ నటిస్తున్న జయలలిత బయోపిక్ లోనూ మా హీరోయిన్ పూర్ణ నటిస్తుండడం మాకు గర్వకారణమన్నారు. ఈ చిత్రానికి ప్రణవ్ సంగీతం అందిస్తున్నారు.

- Advertisement -

Latest news

Related news