32.7 C
Hyderabad
Monday, March 1, 2021

నాగశౌర్య ‘లక్ష్య’ టీజర్‌ చూశారా..

టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య నటించిన ‘లక్ష్య’ టీజర్‌ రిలీజ్ అయింది. నాగశౌర్య భర్త్ డే సందర్భంగా సినిమా యూనిట్ టీజర్ ని అభిమానులతో పంచుకుంది. టీజర్ లో నాగశౌర్య 8 ప్యాక్‌ లుక్ అభిమానులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఆర్చరీ క్రీడా నేపథ్యంలో సాగే ఈ స్టోరీని డైరెక్టర్ సంతోష్ జాగర్లపూడి అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు. ఆటలో చాలా మందికి గుర్తింపు వస్తే ఆటకే గుర్తింపు తెచ్చే వాడిగా నాగశౌర్య రోల్ ను ఎలివేట్ చేస్తూ.. జగపతి బాబు వాయిస్ ఓవర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.  హీరోయిన్ గా కేతిక శర్మ నటిస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ కాల భైరవ అందించిన బ్యాక్ గ్రౌండ్  సౌండ్ ఆకట్టుకుంది. త్వరలోనూ షూటింగ్ పూర్తిచేసి సినిమాను విడుదల చేస్తామని సినిమా యూనిట్ వెల్లడించింది.

- Advertisement -

Latest news

Related news