29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

రవితేజ హల్వా డ్యాన్స్ చూశారా..

53 ఏండ్ల రవితేజలో ఎనర్జీ ఇంకా ఏమాత్రం తగ్గలేదు. సంక్రాంతికి వచ్చిన క్రాక్ బంపర్ కలెక్షన్లతో దూసుకుపోతుంది. 16 రోజుల్లోనే రూ.34 కోట్ల షేర్ సాధించింది. దీంతో జనవరి 26న తన భర్త్ డేని బాగా సెలబ్రేట్ చేసుకున్నాడు. రవితేజ జోరుకు హుషారు తోడైతే ఆ రచ్చ మామూలుగా ఉండదు. రవితేజ పుట్టిన రోజు నాడే యూ ట్యూబ్ లో ఓ డాన్స్ వీడియో బాగా వైరల్ అవుతుంది. అందులో ఈయన చిందులు చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

బర్త్ డే స్పెషల్ ఏమో కానీ జిమ్‌లో కూడా డాన్సులు చేస్తూ హుషారుతో చెలరేగిపోయాడు. పైగా చేతిలో హల్వా పెట్టుకుని డ్యాన్స్ అదరగొట్టాడు. ఓ పక్క హల్వా తింటూ పిచ్చెక్కించే డాన్సులతో అభిమానులకు అదిరిపోయే కిక్ ఇచ్చాడు. ఆ వీడియోను తెగ వైరల్ చేయడంతోపాటు దానికి ‘హల్వా డ్యాన్స్’ అంటూ పేరు పెట్టేశారు అభిమానులు.

ప్రస్తుతం రవితేజ ఖిలాడీ సినిమాతో బిజీగా ఉన్నాడు. బర్త్ డే సందర్భంగా రిలీజైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సమ్మర్ లోనే సినిమా విడుదల చేసేందుకు శరవేగంగా షూటింగ్ చేస్తున్నారు.

- Advertisement -

Latest news

Related news