23.8 C
Hyderabad
Sunday, February 28, 2021

చిరును నడిపించే ఫెంటాస్టిక్ 4 కెప్టెన్లు వీళ్లే..

మెగాస్టార్ చిరంజీవి ఓకేసారి నాలుగు సినిమాలు ప్రకటించడంతో ఆయన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. తాజాగా నలుగురు డైరెక్టర్లతో పని చేస్తున్నట్లు అనౌన్స్ చేశాడు మెగాస్టార్. ఆచార్యతో పాటు తర్వాత చేయబోయే మూడు సినిమాలకు సంబంధించిన డైరెక్టర్లతో ఫోటో దిగి ట్వీట్ చేశాడు చిరు. అంతేకాదు ‘మై కెప్టెన్స్ ఈ నలుగురు.. ఫెంటాస్టిక్ 4.. చార్ కదమ్..’ అంటూ నలుగురు తో దిగిన ఫోటోలు అభిమానులతో షేర్ చేశాడు మెగాస్టార్.

కొరటాల శివ, మోహన్ రాజా, మెహర్ రమేష్, బాబీ చిరును నడిపించే వారిలో ఉన్నారు. ఇప్పటికే కొరటాల శివతో ఆచార్య సినిమా చివరి దశకు వచ్చేసింది. లూసిఫర్ రీమేక్ బాధ్యతలు మోహన్ రాజా, వేదాళం రీమేక్ బాధ్యతలు మెహర్ రమేష్ తీసుకోగా.. బాబీతో  మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఏదేమైనా మెగాస్టార్ స్పీడ్ చూసి అభిమానులు ఫిదా అయిపోతున్నారు.

- Advertisement -

Latest news

Related news