టాలీవుడ్ ‘బర్నింగ్ స్టార్’ సంపూర్ణేశ్ బాబు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. శనివారం ‘బజార్ రౌడీ’ అనే సినిమా క్లైమాక్స్ షూటింగ్లో.. ఎత్తు నుంచి బైక్ పై కిందకు దూకాల్సిన సీన్ ని తీస్తున్నారు. అయితే, బైక్ పై ఉన్న సంపూర్ణేశ్.. ఎత్తు నుంచి కిందకు వస్తున్న సమయంలో అదుపుతప్పి పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన షూటింగ్ సిబ్బంది ఆయన్ను పైకి లేపారు. ఆయనకు తీవ్ర గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సంపూర్ణేశ్ బాబు క్షేమంగా ఉన్నారని, త్వరలోనే షూటింగ్లో పాల్గొంటారని సినిమా వర్గాలు తెలియజేశాయి. వసంత నాగేశ్వర రావు దర్శకత్వం వహిస్తున్న బజార్ రౌడీ సినిమాను సందిరెడ్డి శ్రీనివాస్ నిర్మిస్తున్నారు.