జగపతిబాబు ప్రధాన పాత్రలో నటించిన ఎఫ్‌సీయూకే చిత్రం ఫిబ్రవరి 12న రిలీజ్ అవ్వనుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో జగపతి బాబు మాట్లాడుతూ.. “ఫాదర్-చిట్టి-ఉమా-కార్తీక్” టైటిల్ చూసి కొంతమంది వేరుగా అనుకుంటున్నారని, నిజానికి ఈ సినిమా కడుపుబ్బా నవ్వించే చిత్రమని, జనాలకు చేరువవ్వాలనే ఉద్దేశంలో ఆ టైటిల్ పెట్టామన్నారు.
ఈ ప్రీ రిలీజ్ వేడుకలో సునీల్ తోపాటు కొందరు సోషల్ మీడియా స్టార్స్ కూడా హాజరయ్యారు. అందులో టిక్‌టాక్ స్టార్ దుర్గారావు కూడా ఉన్నారు. దుర్గారావుతో కలిసి జగపతిబాబు డ్యాన్స్ చేయడం ప్రత్యేకంగా ఆకట్టుకుంది.
