క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా అదరగొడుతున్న డైనమిక్ యాక్టర్ జగపతిబాబు వరుస సినిమాలతో బిజిగా ఉన్నారు. ఇప్పుడు తాజాగా జగపతి బాబు ప్రధాన పాత్రలో ఎఫ్‌సీయూకే (ఫాదర్,చిట్టి,ఉమా,కార్తీక్) అనే సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే జగ్గు భాయ్ రీసెంట్ గా చేతులకు శిలువ, నెత్తిన కిరీటంతో జీసస్ గెటప్ లో ఉన్న ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే అది ఎందుకు చేశారు?, సందర్భం ఏంటి? ఏదైనా మూవీకి సంబంధించిందా అనే వివరాలు మాత్రం ఎక్కడా ఇవ్వలేదు. ఇప్పుడా ఫోటో వైరల్ గా మారింది.
— Jaggu Bhai (@IamJagguBhai) January 25, 2021