టాలీవుడ్ టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. తరచూ తన సినిమా, పర్సనల్ లైఫ్ విశేషాలను అభిమానులతో పంచుకుటుంది. ఈ క్రమంలోనే కాజల్ తనకున్న వ్యాధి గురించి తాజాగా బహిర్గతం చేసింది. దాంతో తన ఫాలోవర్స్ ఒకింత బాధపడుతూ ‘అవునా..’, ‘అయ్యో పాపం’ అంటూ రిప్లై పెడుతున్నారు.
‘తనకు ఐదేండ్ల వయసు ఉన్నప్పటి నుండి బ్రాంకియల్ ఆస్తమా వ్యాధితో బాధపడుతున్నాను. దీంతో ఫుడ్ అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. చాలా జాగ్రత్తలు తీసుకున్నాను. చలికాలం వస్తే ఆ వ్యాధి ఎక్కువవుతుంది. దాన్నుండి బయటపడేందుకు ఇన్హేలర్ వాడాను. ఇప్పటికీ తన వెంట ఇన్హేలర్ ఉంటుంది. ఇన్హేలర్ వాడేందుకు కొందరు సిగ్గుపడతారు. ఎవరో ఏదో అనుకుంటారని ఇన్హేలర్ వాడటం మానొద్దు.’ అని కాజల్ తన ఇన్ స్టాలో రాసుకొచ్చింది.