32.7 C
Hyderabad
Monday, March 1, 2021

కంగనా vs రిహానా

ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమానికి పాప్ సింగర్ రిహానా స్పందించింది.రైతు ఉద్యమానికి సంబంధించిన ఓ న్యూస్‌ ఆర్టికల్‌ను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేస్తూ.. “ఈ అంశంపై మనం ఎందుకు మాట్లాడట్లేదు” అని క్యాప్షన్‌ యాడ్ చేసింది. అయితే రిహానా చేసిన ఈ ట్వీట్‌పై బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. రిహానా ట్వీట్‌కు రిప్లై ఇస్తూ.. “ఈ సంఘటన గురించి ఎవరూ మాట్లాడరు కారణం వారు రైతులు కాదు కాబట్టి. వారు దేశాన్ని విభజించాలని చూస్తోన్న ఉగ్రవాదులు” దేశాన్ని విభజించాక వాటిని చైనా ఆక్రమించి చైనీస్ కాలనీల్లా తయారు చేస్తుంది. అచ్చం అమెరికా లాగా.. నువ్వు మాట్లాడొద్దు. మేము మీలాగా మా దేశాన్ని అమ్మడం లేదు. అంటూ తీవ్ర స్థాయిలో స్పందించింది కంగనా. ఇలా మాట్లాడడంపై చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. రైతులకు సపోర్ట్ ఇవ్వడం మంచి విషయమే కదా.. రైతులను టెర్రరిస్టులు అనడమేంటి అని కొందరు నెటిజన్లు సీరియస్ అవుతున్నారు.

- Advertisement -

Latest news

Related news