29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

కేజీఎఫ్2 డేట్ ప్రకటించేశారుగా!

భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా దేశం మొత్తం ఎంతో ఇంట్రెస్ట్ తో ఎదురు చూస్తున్న సినిమా కేజీఎఫ్2. యష్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్1 సంచలన విజయం తర్వాత.. చాప్టర్ 2 మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. టీజర్, పోస్టర్ ఇలా ఏది విడుదల చేసినా.. సోషల్ మీడియా దద్దరిల్లిపోయింది. షూటింగ్ పనులు పూర్తి చేసుకొని త్వరలో సినిమా విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించేసింది. ఈ మధ్య విడుదల చేసిన ట్రైలర్ యూట్యూబ్ ని షేక్ చేసింది.
ఈ సినిమా యూనిట్ అభిమానులకు మరో శుభవార్త చెప్పింది. సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ ఓ పోస్టర్ విడుదల చేసింది. జులై 16న ప్రపంచవ్యాప్తంగా కేజీఎఫ్2 సినిమా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ విజువల్ వండర్ ని పెద్ద స్క్రీన్ మీద చూసి ఎంజాయ్ చేయాలని ఇప్పటికే సినీ ఫ్యాన్స్ ఉబలాటపడుతున్నారు.

- Advertisement -

Latest news

Related news