యశ్ హీరోగా నటిస్తున్న కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా ట్రైలర్ యూట్యూబ్ లో సరికొత్త రికార్డులు బ్రేక్ చేస్తోంది. జనవరి 7 రాత్రి విడుదలైన ట్రైలర్.. 16 గంటల్లోనే దాదాపు 23 మిలియన్ వ్యూస్ సంపాదించుకుంది. 2.8 మిలియన్ లైక్ లు సాధించి ఇండియన్ సినిమాలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. మార్చి 26న ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని నిర్మాతలు ఆలోచన చేస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. విదుడలకు ముందే ఈ సినిమా దాదాపు రూ.230 కోట్ల బిజినెస్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ.30 కోట్ల వరకు బిజినెస్ జరిగిందని సమాచారం.