29.8 C
Hyderabad
Sunday, February 28, 2021

‘వాషి’తో ఏడేండ్ల కల నెరవేరింది.. కీర్తి

‘ఇది నా మనసుకు దగ్గరైన సినిమా. మా కుటుంబాన్ని కలిపే సినిమా ఇది.  ‘వాషి’ని మీకు పరిచయం చేసేందుకు ఏడేండ్లు పట్టింది.’  అని కీర్తి సురేశ్ సంబరాలు చేసుకుంటుంది. తన యాక్టింగ్ తో ప్రపంచ వ్యాప్తంగా ఫాలోవర్లను సంపాదించుకున్న కీర్తి.. మహానటి సినిమాతో స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. తాజాగా తన తల్లిదండ్రులు సురేశ్‌కుమార్‌, రేవతి నిర్మాతలుగా మళయాళంలో నిర్మిస్తోన్న ‘వాషి’ సినిమాలో కీర్తి నటిస్తోంది. ఈ సినిమాకు విష్ణు జీ రాఘవ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ‘ఈ ప్రాజెక్టులో భాగం కావడం ఎగ్జాయిటింగ్ గా ఉంది’ అని కీర్తి ట్విటర్ లో తన సంతోషాన్ని అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం కీర్తి తెలుగులో ‘సర్కారు వారి పాట’లో మహేశ్ బాబు సరసన నటిస్తుంది. ఇటీవలే దుబాయిలో ప్రారంభమైన షూటింగ్ లో పాల్గొనేందుకు కీర్తి దుబాయ్ వెళ్లిన విషయం తెలిసిందే.

- Advertisement -

Latest news

Related news