టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి బ్రాండ్ విలువ ఏటా పెరుగుతూ పోతుంది. కరోనా టైంలో కూడా విరాట్ బ్రాండ్ విలువ తగ్గకపోవడం విశేషం. భారత్ కు చెందిన పర్సనల్ బ్రాండ్ ఇమేజ్ లిస్ట్ లో కోహ్లీ ముందున్నాడు.
2020 ఏడాదికిగాను భారత్‌కు చెందిన సెలబ్రిటీల బ్రాండ్ వాల్యూస్ ను అంతర్జాతీయ గణాంకాల సంస్థ డఫ్ అండ్ ఫెల్ప్స్ విడుదల చేసింది. ఈ లిస్ట్ లో 237.7 మిలియన్ డాలర్లు విలువ చేసే బ్రాండ్ ఇమేజ్‌తో విరాట్ కోహ్లీ అందరికంటే ముందున్నాడు. ఈ ఫస్ట్ ప్లేస్ విరాట్ కు వరుసగా నాలుగోసారి. ఇక విరాట్ తర్వాతి స్థానాల్లో.. టాప్ టెన్‌లో అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్, షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె, అలియా భట్, ఆయుష్మాన్ ఖురానా, సల్మాన్ ఖాన్, బిగ్ బి అమితాబ్ బచ్చన్, హృతిక్ రోషన్లు ఉన్నారు.
