పొలిటికల్ నేపథ్యంలో నటి రిచా చద్దా ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘మేడమ్ చీఫ్ మినిస్టర్’ ట్రైలర్ రిలీజైంది. ఇందులో రిచా వెనుకబడిన వర్గాల ప్రజల కోసం పోరాడే పవర్ఫుల్ మహిళ నాయకురాలిగా కనిపించనున్నారు. కుల వ్యవస్థను, పితృస్వామ్య వ్యవస్థను సవాల్ చేస్తూ ఓ చిన్న గ్రామానికి చెందిన ఒక యువతి రాజకీయాల్లోకి ప్రవేశించి ఏలా అధికారాన్ని చేపట్టిందో తెలసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. సౌరభ్ శుక్లా, మానవ్ కౌల్, అక్షయ్ ఒబెరాయ్లు కీలక పాత్రలో కనిపించనున్నారు. డైరెక్టర్ సుభాష్ కపూర్ రూపోందిస్తున్న ఈ సినిమాను భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, నరేన్ కుమార్, డింపుల్ ఖర్బందాలు కలిసి నిర్మిస్తున్నారు.